PONGULETI: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి కీలక ఆదేశాలు

డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలన్న పొంగులేటి... ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవాలన సూచన;

Update: 2024-12-13 02:00 GMT

తెలంగాణ వ్యాప్తంగా 2.32 లక్షల ఇళ్ల దరఖాస్తులకు సర్వే పూర్తి చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలనలో అప్లై చేయని వారు ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వెల్లడించారు. సంక్రాంతి లోపు వీఆర్వో వ్యవస్థను తీసుకొస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ గృహనిర్మాణం, గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణ, హాస్టళ్లలో ఆహార నాణ్యత తదితర అంశాలపై సచివాలయం నుంచి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఇళ్లకు 80 లక్షల దరఖాస్తులు

ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన సందర్భంగా వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల సర్వేను పూర్తిచేసి యాప్‌లో నమోదుచేయాలని చెప్పారు. డిసెంబర్ 31లోగా దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. ఒక్క దరఖాస్తును కూడా వదలకుండా, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు. రోజూ కలెక్టర్లు సర్వే జరుగుతున్న తీరును సమీక్షించాలని తెలిపారు.

సామాజిక సర్వే పూర్తి

రాష్ట్రంలో 1.16 కోట్ల కుటుంబాల‌‌కు గాను 1.12 కోట్ల కుటుంబాల సామాజిక సర్వే పూర్తయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇంటింటి కులగణన సర్వేకు ఈ నెల13వ తేదీ చివరి గడువని, ఆ తర్వాత ప్రజాపాల‌‌న సేవా కేంద్రాల్లో కుటుంబ స‌‌ర్వే వివ‌‌రాల‌‌ను న‌‌మోదు చేసుకోవ‌‌చ్చని సూచించారు.

Tags:    

Similar News