Telangana Police : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్ల పై కీలక నిర్ణయం
Telangana Police : హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధితో పాటు తెలంగాణ వ్యాప్తంగా... పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.;
Telangana Police : తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది పోలీస్ శాఖ. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధితో పాటు తెలంగాణ వ్యాప్తంగా... పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ద్విచక్ర, త్రిచక్రవాహనాదారులు... చలానా మెుత్తంలో 75 శాతం రాయితీతో ఈ-లోక్‌అదాలత్‌లో చెల్లింపులు చేయవచ్చు. ఇక.. కార్లకు 50 శాతం, బస్సులకు 70 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. తోపుడు బండ్లకు పెండింగ్ చలాన్లలో 80శాతం రాయితీ ఇస్తుంది. ఇందుకోసం ఈ-చలాన్ పోర్టల్‌లో మార్పులు చేస్తున్నారు. ఇప్పటి వరకు పోర్టల్‌లో వాహనం నంబరును నమోదు చేయగానే.. ఉల్లంఘన చలానా మొత్తం కనిపించేది. కానీ.. ఇప్పుడు రాయితీతో కూడిన చెల్లింపులకు వీలుగా వెబ్ సైట్ ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మార్చి ఒకటి నుంచి 31వరకు పెండింగ్ చలానాలను క్లియర్ చేసుకోవచ్చని తెలిపింది.