V.C Sajjanar IPS MD TSRTC Office: సజ్జనార్ మంచి మనసు.. సొంత ఖర్చుతో వృద్దులను..

V.C Sajjanar IPS MD TSRTC Office: సిద్ధార్ధ అనే యువకుడు 20 మంది అనాధ వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారి బాగోగులు చూస్తున్నాడు.

Update: 2022-01-28 10:30 GMT

V.C Sajjanar IPS MD TSRTC Office: అటు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా, ఇటు ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వహిస్తున్నా తనదైన ముద్ర వేస్తున్నారు సజ్జనార్. శ్రీకాకుళానికి చెందిన 20 మంది వృద్ధులకు తన సొంత ఖర్చుతో భద్రాచలానికి బస్సు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆర్టీసిని ప్రజలకు చేరువ చేసేందుకు వినూత్న నిర్ణయాలతో ఆకట్టుకుంటున్నారు.

తరచూ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణీకుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సమాజానికి తన వంతు సాయం చేయడంలో ముందుండే సజ్జనార్.. ఆంధ్రప్రదేశ్‌లోని అ20 మంది అనాధ వృద్ధులకు భద్రాచల సీతారామస్వాని సందర్శించాలన్న కోరికను గురించి తెలుసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వావివలసలో సాలూరు సిద్ధార్ధ అనే యువకుడు 20 మంది అనాధ వృద్ధులకు ఆశ్రయం కల్పించి వారి బాగోగులు చూస్తున్నాడు. ఇటీవల వారు తమకు భద్రాద్రి రాముడిని చూడాలని ఉందని సిద్ధార్ధకు చెప్పగా ఆ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఫోన్ చేసి చెప్పాడు.

దీంతో స్పందించిన సజ్జనార్ తన సొంత ఖర్చులతో శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి బస్సు ఏర్పాటు చేశారు. దీంతో ఆ వృద్ధులంతా గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామిని, పర్ణశాలను దర్శించి పరవశం పొందారు. వారికి దర్శనంతో పాటు వసతి భోజన సౌకర్యాలను కూడా సజ్జనారే స్వయంగా భరించారు.

తమకు ఈ అవకాశం కల్పించిన సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఆనందభాష్పాలతో తిరుగుపయనమయ్యారు. ఈ విషయాన్ని సజ్జనార్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. మనకి ఉన్నదాంట్లో అవసరం ఉన్నవారికి సాయం చేద్ధాం.. మానవత్వం చాటుకుందాం అని ఆయన క్యాప్షన్ జోడించారు. దీంతో నెటిజన్ల మనసు మరోసారి దోచుకున్నారు సజ్జనార్. 

Tags:    

Similar News