TET Results : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల...

Update: 2025-07-22 10:15 GMT

తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి . విద్యా శాఖ కార్యదర్శి యోగితా రానా సచివాలయం లో ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1,37,429 మంది పరీక్ష రాయగా వీరిలో 30,649 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 33.98 శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కాగా జూన్‌ 18 నుంచి 30 వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. పేపర్‌-1లో 61.5 శాతం మంది అభ్యర్థులు పాస్‌ అయినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ ఫలితాలను http: scooledu.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

Tags:    

Similar News