తెలంగాణలో స్కూల్స్‌ తరహాలోనే త్వరలో ధియేటర్లు, మాల్స్‌పై నిర్ణయం?

వైద్య ఆరోగ్య శాఖ రిపోర్ట్‌ను బట్టి త్వరలోనే కోవిడ్‌ నిబంధనలు కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకోనుంది.

Update: 2021-03-24 07:09 GMT

తెలంగాణలో స్కూల్స్‌ తరహాలోనే త్వరలో ధియేటర్లు, మాల్స్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఆంక్షలు తప్పవని సర్కారు ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ రిపోర్ట్‌ను బట్టి త్వరలోనే కోవిడ్‌ నిబంధనలు కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకోనుంది.

ధియేటర్లు 50 శాతం ఆక్సుపెన్సీతో నడిచేలా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. సగం సీట్లతో రన్ చేస్తున్న పరిస్థితుల్లోనూ బయట కేసుల తీవ్రత తగ్గకపోతే తాత్కాలికంగా ధియేటర్లు, మాల్స్ మూసివేతపై నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న హెచ్చరికల నేపథ్యంలో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్క్, శానిటైజర్‌ వాడకం తప్పనిసరని వైద్యఆరోగ్యశాఖ సూచిస్తోంది.

అటు, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 431 కేసులు వస్తే వాటిల్లో సగం వరకూ గ్రేటర్ పరిధిలోనే ఉండడం టెన్షన్ పుట్టిస్తోంది.


Tags:    

Similar News