Bhatti Vikramarka : తెలంగాణలో త్వరలో 25,190 ఉద్యోగాల భర్తీ: భట్టి విక్రమార్క

Update: 2025-03-19 11:30 GMT

త్వరలోనే 14,236 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్లలో గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫలితాలు ప్రకటించిన పరీక్షలకు సంబంధించి త్వరలోనే నియామక పత్రాలు ఇస్తామన్నారు.

బడ్జెట్‌లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందుతాయని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌గా రూ.24,439 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.

సన్న రకం వడ్లకు రూ.500 బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. వానకాలం పంటకు సంబంధించి రూ.1200 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నిన్న ఆమోదం తెలిపిందని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News