Ayushman Bharat : తెలంగాణలోనూ ఆయుష్మాన్ భారత్ అమలు
Ayushman Bharat : కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం ఇక తెలంగాణలో కూడా అమలు కానుంది.;
Ayushman Bharat : కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం ఇక తెలంగాణలో కూడా అమలు కానుంది. ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల మేరకు ఆయుష్మాన్ భారత్ కింద వైద్య సేవలు అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు చికిత్స ఉచితం. దీని కింద దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆసుపత్రులలో 1000 కి పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు.