Telangana Government : అన్ని బోర్డుల స్కూళ్లలో తెలుగు తప్పనిసరి! తెలంగాణ సర్కార్ ఆదేశాలు

Update: 2025-02-26 13:30 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ను తప్పనిసరిగా బోధించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇంటర్ బోర్డు (ఐబీ) సహా ఇతర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలివచ్చింది. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్ అమలు చేసేందుకు ప్రభుత్వం విద్యాశాఖకు అనుమతి ఇచ్చింది. 9వ తరగతి వారికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతికి 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఈ నిర్ణయంతో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుగు చదవాలని చెప్పడంతో తెలుగు భాషకు కొంత జవసత్వాలు వచ్చే అవకాశం ఉందని తెలుగు పండితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News