తాను వేసిన పంట డబ్బుల విషయంలో తనకు న్యాయం చేయాలని ఓ కౌలు రైతు సెల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో జరిగింది. చల్మెడ గ్రామానికి చెందిన బొమ్మ చిన్న నారాయణ అనే వృద్ధుడు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పొలం కౌలుకు చేస్తున్నాడు. అయితే పంట విక్రయించగా తనకు రావాల్సిన డబ్బును భూ యజమాని ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయాడు. పోలీసులు అతడికి నచ్చజెప్పడంతో కిందికి దిగాడు.