మేడ్చల్ జిల్లా పర్వతాపూర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసలైన లబ్దిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇండ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తమకు గతంలో 60 గజాల స్థలంలో 400 మందికి పట్టాలు ఇచ్చారని… బేస్‌మెంట్ నిర్మాణాలు కూలగొట్టి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇస్తామని అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న మలిపెద్ది సుధీర్ రెడ్డి హామీ ఇచ్చి డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారని బాధితులు అంటున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాటతో పలువురికి గాయాలయ్యాయి. మేడిపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.