మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామంలో పరిస్థితి ఉద్రిక్తం..!
మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈటల రాజేందర్‌పై ఆరోపణలు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారు.;
మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఈటల రాజేందర్‌పై ఆరోపణలు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారు. ఈటలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు అభిమానులు. దీంతో కమలాపూర్ సహా హుజూరాబాద్ నియోజకవర్గంలో అడుగడుగునా పోలీసులను భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఈటలపై వేటు వేసే ఉద్దేశంతోనే పోలీసులను భారీగా మోహరించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, ముందస్తుగా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారని చెప్పుకుంటున్నారు.