సంచలనం రేపిన సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసం వెనుక ఉగ్ర కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దాంతో వెలుగులోకి వాస్తవాలు బయటపడుతున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ అంతర్జాలం ద్వారా భారత్‌లో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని పిటిషన్ వేశారు. ఆగస్టు 17న కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదు చేశారు… అయితే అప్పుడు మారేడుపల్లి పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ధ్వంసంతో మరోసారి ఉగ్ర కోణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.