తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీజీ టెట్) దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000గా ఫీజు నిర్ణయించారు. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు వస్తే హెల్ప్‌డెస్క్(7093958881, 7093468882) ఈ నెల 15 నుంచి జులై 22 వరకు అందుబాటులో ఉంటుంది. టెట్ పరీక్షలు జూన్ 15 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
గతంలో 2024 మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ నిర్వహించారు. ఈ పరీక్షకు రెండు పేపర్లకు కలిపి 2,36,487 మంది హాజరయ్యారు. కాగా త్వరలో డీఎస్సీ చేపడతామని ప్రభుత్వం వెల్లడించడంతో ఈసారి టెట్‌కు ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
పరీక్ష ఫీజును ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1,000గా నిర్ణయించారు. బీఈడీ చేసిన అభ్యర్థులు రెండు పేపర్లు రాసే అవకాశం ఉంటుంది. దరఖాస్తుతో పాటే ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లాంగ్వేజ్ పండిట్లు కూడా సంబంధిత అర్హతలతో దరఖాస్తు చేసుకోవచ్చు.