తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉ.9 నుంచి 11.30 వరకు, మ.2 నుంచి 4.30 వరకు రెండు షెడ్యూళ్లుగా పరీక్షలు ఉండనున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక.. ఇటీవల తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించిన సిలబస్ (మొత్తం 15 పేపర్లు)ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈసారి టెట్ పరీక్షకు మొత్తం 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై.. 11. 30 గంటలకు ముగుస్తుంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై.. 04.30 గంటలకు పూర్తవుతుంది. అనంతరం ప్రిలిమినరీ కీ, ఫైనల్ కీ విడుదల చేసి.. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలు ప్రకటిస్తారు.