TG: తెలంగాణ టీచర్లకు బ్రిటీష్ శిక్షణ
బ్రిటిష్ హైకమిషనర్ లిండీతో సీఎం భేటీ.. కీలక చర్చలు జరిపిన లిండీ, సీఎం రేవంత్... తెలంగాణ విద్యార్థులకు బ్రిటన్ స్కాలర్షిప్... ఎడ్యుకేషన్, టెక్నాలజీ రంగాల్లో సహకారం
భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు ఇచ్చేందుకు లిండీ కామెరాన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి బ్రిటిష్ హైకమిషనర్ వివరించారు. యూకే యూనివర్సిటీలలో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అక్కడి యూనివర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్‌ను కూడా బ్రిటీష్ హైకమిషనర్‌కు సీఎం రేవంత్ వివరించారు.
విద్యా విధానంపైనా చర్చ
తెలంగాణలో తీసుకురాబోతున్న నూతన విద్యా విధానం డ్రాఫ్ట్ ను వీరికి సీఎం వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు బ్రిటిష్ హై కమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. యూకేలో చదువుతున్న తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం యూకే యూనివర్సిటీలు హైదరాబాద్ లో కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సీఎం కోరారు. అలాగే మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటి,న్ కంపెనీలు భాగస్వాములు కావాలని, బీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఆహ్వానించారు. సీఎం విజ్ఞప్తులపై బ్రిటిషన్ హై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ- యూకే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు సహకరించేందుకు హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
హైదరాబాద్‌లో గురువారం కూడా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో రోడ్లపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అమీర్‌పేట్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీంతో వాహనదారులు చుక్కలు చూశారు. వరుసగా వర్షం పడుతుండడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.