TG: కొనసాగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలు

పలు చోట్ల ఘర్షణలు...కోర్లపహాడ్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ

Update: 2025-12-11 04:00 GMT

తెలంగాణలో తొలి విడత పంచాయతీల ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు చోట్ల వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగుతున్నారు. బుధవారం రాత్రి నల్గొండ జిల్లా కోర్లపహాడ్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. రాళ్లు, కత్తులతో ఇరువర్గాలు దాడికి పాల్పడటంతో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కొర్లపహాడ్‌ గ్రామంలో మోహరించారు. తొలివిడత పోలింగ్‌‌ ప్రారంభమైంది. ఈ క్రమంలో 3,834 సర్పంచ్, 27,628 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.

బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు:

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడినా, గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయి. ప్రతి ఓటరు సర్పంచ్‌కు ఒక ఓటు, వార్డు సభ్యుడికి ఒక ఓటు చొప్పున రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థికి: గులాబీ రంగు బ్యాలెట్ పత్రం, వార్డు సభ్యుడికి: తెలుపు రంగు బ్యాలెట్ పత్రం. బ్యా­లె­ట్ పత్రం­లో అభ్య­ర్థుల పే­ర్లు ఉం­డ­వు, కే­వ­లం వా­రి­కి కే­టా­యిం­చిన గు­ర్తు­లు మా­త్ర­మే ఉం­టా­యి. నచ్చిన అభ్య­ర్థి గు­ర్తు­పై స్వ­స్తి­క్ ము­ద్ర వేసి ఒకే బ్యా­లె­ట్ డబ్బా­లో వే­యా­లి. ఓట­ర్ల­కు అభ్య­ర్థు­లు నచ్చ­క­పో­తే, బ్యా­లె­ట్ పత్రం చి­వ­ర­లో ఉన్న నోటా (NOTA) గు­ర్తు­కు ఓటు వే­యొ­చ్చు. ఓటు వే­య­డా­ని­కి వె­ళ్లే­ట­ప్పు­డు ఓటరు జా­బి­తా­లో పేరు నమో­దై ఉం­డ­టం­తో పాటు, తప్ప­ని­స­రి­గా ఓటరు గు­ర్తిం­పు కా­ర్డు (EPIC) తీ­సు­కె­ళ్లా­లి. అది లేని పక్షం­లో, ఆధా­ర్ కా­ర్డు, పా­స్‌­పో­ర్టు, పాన్ కా­ర్డు, డ్రై­విం­గ్‌ లె­సె­న్స్‌ వంటి 12 రకాల ఇతర గు­ర్తిం­పు కా­ర్డు­ల్లో దే­ని­నై­నా పరి­గ­ణ­న­లో­కి తీ­సు­కుం­టా­రు. కౌం­టిం­గ్‌­లో ముం­దు­గా వా­ర్డు సభ్యుల ఓట్లు, ఆ తర్వాత సర్పం­చ్ అభ్య­ర్థుల ఓట్లు లె­క్కి­స్తా­రు. ఒక­వేళ ఓట్లు సమా­నం­గా వస్తే లా­ట­రీ ద్వా­రా వి­జే­త­ను ప్ర­క­టి­స్తా­రు. ఎన్ని­కైన వా­ర్డు సభ్యు­లం­ద­రూ సమా­వే­శ­మై తమలో ఒక­రి­ని ఉప సర్పం­చ్‌­గా ఎన్ను­కుం­టా­రు. సర్పం­చ్, ఉప సర్పం­చ్, వా­ర్డు సభ్యుల పద­వీ­కా­లం 5 సం­వ­త్స­రా­లు. ఈ ఎన్ని­క­ల­ను ప్ర­ధాన పా­ర్టీ­లు ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కు­ని, తమ అభ్య­ర్థు­ల­ను గె­లి­పిం­చు­కు­నేం­దు­కు తీ­వ్రం­గా ప్ర­య­త్ని­స్తు­న్నా­యి. ఈ నే­ప­థ్యం­లో, ఓట­ర్లు తమ పని వే­ళ­లు చూ­సు­కు­ని, మధ్యా­హ్నం 1 గం­ట­లో­పు తప్ప­కుం­డా ఓటు వే­యా­ల­ని అధి­కా­రు­లు వి­జ్ఞ­ప్తి చే­స్తు­న్నా­రు.

Tags:    

Similar News