TG: ప్రపంచం చూపంతా"గ్లోబల్ రైజింగ్‌" వైపే

నేటి నుంచి తెలంగాణ గ్లోబర్ రైజింగ్ సమ్మిట్‌... అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్‌.. తరలివస్తున్న దేశ, విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు

Update: 2025-12-08 02:30 GMT

తె­లం­గాణ ప్ర­భు­త్వం మరో ప్ర­తి­ష్టా­త్మక సద­స్సు­కు వే­ది­కైం­ది. నేడు, రేపు ఫ్యూ­చ­‌­ర్ సి­టీ­లో ని­ర్వ­హిం­చ­ను­న్న తె­లం­గాణ గ్లో­బ­ల్ రై­జిం­గ్ - 2025 స‌­మ్మి­ట్‌­ను రా­ష్ట్ర ప్ర­భు­త్వం అత్యంత ప్ర­తి­ష్టా­త్మ­కం­గా తీ­సు­కుం­ది. గ్లో­బ­ల్ సమ్మి­ట్‌­కు దేశ, వి­దే­శాల నుం­చి రా­ను­న్న ప్ర­తి­ని­ధు­ల­ను ఆక­ట్టు­కు­నేం­దు­కు హై­ద­రా­బా­ద్ మహా నగ­రా­న్ని అం­దం­గా ము­స్తా­బు చే­సేం­దు­కు భారీ ఏర్పా­ట్లు చే­సిం­ది. అత్యా­ధు­నిక టె­క్నా­ల­జీ, ప్ర­త్యేక ఎట్రా­క్ష­న్స్ మే­ళ­విం­పు­తో జరు­గు­తు­న్న ఏర్పా­ట్లు పూ­ర్త­య్యా­యి.

తెలంగాణ సాంస్కృతిక వైభవం కనిపించేలా..

గ్లో­బ­ల్ సమ్మి­ట్‌­కు రా­ను­న్న ప్ర­ము­ఖు­ల­ను ఆక­ట్టు­కు­నేం­దు­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం అనేక రకాల చర్య­లు తీ­సు­కుం­టుం­ది. ప్ర­తి అం­శం­లో­నూ తె­లం­గాణ సాం­స్కృ­తిక వై­భ­వం కని­పిం­చే­లా ఏర్పా­ట్లు చే­సిం­ది. ఇం­దు­లో భా­గం­గా గ్రే­ట­ర్ హై­ద­రా­బా­ద్ పరి­ధి­లో­ని చా­ర్మి­నా­ర్, కా­చి­గూడ రై­ల్వే స్టే­ష­న్ భవ­నం­పై ప్ర­త్యేక లై­టిం­గ్ ప్రొ­జె­క్ష­న్ ఏర్పా­టు చేసి జా­తీయ, అం­త­ర్జా­తీయ అతి­థు­ల­కు తె­లం­గాణ సాం­స్కృ­తిక వై­భ­వా­న్ని చూ­పిం­చ­ను­న్నా­రు. సె­క్రె­టే­రి­య­ట్ వద్ద అద్భు­త­మైన త్రీ­డీ ప్రొ­జె­క్ష­న్ మ్యా­పిం­గ్‌­‌­తో రా­ష్ట్ర అభి­వృ­ద్ధి తీరు, భవి­ష్య­త్ లక్ష్యా­ల­ను ఆక­ర్ష­ణీ­యం­గా చూ­పిం­చేం­దు­కు ప్ర­ణా­ళిక రూ­పొం­దిం­చా­రు. రై­జిం­గ్ తె­లం­గాణ - 2047 లక్ష్యా­లు అం­ద­రి­కీ అర్థ­మ­య్యే రీ­తి­లో ఈ డి­స్‌­ప్లే­లు ఉం­డ­ను­న్నా­యి. దు­ర్గం చె­రు­వు­లో గ్లో­బ్ ఆకా­రం­లో తే­లి­యా­డే ప్రొ­జె­క్ష­న్ ఏర్పా­టు చే­స్తు­న్నా­రు. ఇం­దు­లో తె­లం­గాణ రై­జిం­గ్ గ్లో­బ­ల్ సమ్మి­ట్ లో­గో­ను ఇన్‌­లి­ట్ టె­క్ని­క్‌­‌­తో అద్భు­తం­గా ప్ర­ద­ర్శిం­చ­ను­న్నా­రు.

వాటర్‌ ప్రొజెక్షన్‌లో ముఖ్యాంశాలు

హు­స్సే­న్‌­సా­గ­ర్‌­‌­లో వా­ట­ర్ ప్రొ­జె­క్ష­న్ ద్వా­రా ప్ర­భు­త్వం చే­ప­ట్టిన భా­ర­త్ ఫ్యూ­చ­ర్ సిటీ, మహి­ళా సా­ధి­కా­రత, యువత, రైతు కా­ర్య­క్ర­మా­లు, 3 ట్రి­లి­య­న్ ఎకా­న­మీ లక్ష్యం లాం­టి ము­ఖ్య అం­శా­ల­ను చూ­పిం­చ­ను­న్నా­రు. శం­షా­బా­ద్ వి­మా­నా­శ్ర­యం నుం­చి సమ్మి­ట్ వే­దిక వరకు వె­ళ్లే అప్రో­చ్ రో­డ్డు­పై భారీ డి­జి­ట­ల్ ఎల్ఈ­డి స్క్రీ­న్లు ఏర్పా­టు చే­స్తు­న్నా­రు. వీ­టి­పై భా­ర­త్ ఫ్యూ­చ­ర్ సి­టీ­కి ఎలా చే­రు­కో­వా­లి, ఎంత దూరం ఉం­టుం­ది వంటి వి­వ­రా­లు పొం­దు పర­చ­ను­న్నా­రు. గ్లో­బ­ల్ సమ్మి­ట్ లో­గో­తో తయా­రు చే­యిం­చిన 1500 రం­గు­రం­గుల జెం­డా­ల­ను నగర వ్యా­ప్తం­గా ఏర్పా­టు చే­య­ను­న్నా­రు. సమ్మి­ట్ వే­దిక వద్ద లో­ప­లి­కి వె­ళ్లే మా­ర్గా­న్ని మొ­త్తం ఆధు­నిక త్రీ­డీ ఎనీ మా­ర్ఫి­క్ డి­జై­న్ల­తో రూ­పొం­ది­స్తు­న్నా­రు. 50 మీ­ట­ర్ల పొ­డ­వు­తో డి­జి­ట­ల్ టన్నె­ల్‌­‌­ను ఇం­ట­రా­క్టి­వ్ డిస్ ప్లే రూ­పం­లో ఏర్పా­టు చేసి మూసీ ప్ర­క్షా­ళన ప్రా­జె­క్టు పు­రో­గ­తి­ని వి­జు­వ­ల్స్ ద్వా­రా చూ­పిం­చేం­దు­కు ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు. హై­ద­రా­బా­ద్‌­లో­ని పది వే­ర్వే­రు ప్ర­దే­శా­ల్లో ప్ర­త్యేక సమా­చార స్టా­ల్స్ ఏర్పా­టు చే­స్తు­న్నా­రు. ఇక్కడ గ్లో­బ­ల్ సమ్మి­ట్‌­‌­కు సం­బం­ధిం­చిన వి­వ­రా­లు, ఫ్యూ­చ­ర్ సిటీ ప్ర­ణా­ళిక, డి­జి­ట­ల్ స్క్రీ­న్ల­పై వి­జు­వ­ల్స్, సమ్మి­ట్ బ్రో­చ­ర్లు అం­దు­బా­టు­లో ఉం­చ­ను­న్నా­రు. అక్క­డు­న్న వలం­టీ­ర్లు ప్ర­జ­ల­కు సమ్మి­ట్ డైలీ షె­డ్యూ­ల్‌­ను వి­వ­రిం­చి అవ­గా­హన కల్పిం­చే­లా ఏర్పా­ట్లు చే­స్తు­న్నా­రు.

Tags:    

Similar News