దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నవేళ ప్రముఖ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం భక్తులతో కిటకి టలాడుతున్నారు. దీపావళి పండుల పర్వదినం సందర్భంగా ఆలయం వద్ద అయోధ్య ఆలయ నమూనాను పోలిన డెకరేషన్ చేశారు. దీంతో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆలయ నిర్వహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అంతేకాక ఇక్కడికి వచ్చిన వారికి చార్మినార్, భాగ్యలక్ష్మి దేవి దర్శనంతో పాటు అయోధ్య రామాలయం కూడా విజిట్ చేసిన అనుభూతి కలుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.