Gulzar Houz Fire Incident : నిర్లక్ష్యమే కారణం.. ప్రమాదంపై వీడిన మిస్టరీ

Update: 2025-05-22 06:59 GMT

చార్మినార్ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనలో మిస్టరీ వీడింది. ఈ ప్రమాదంలో బాధితుల నిర్లక్ష్యమే 17 మంది నిండు ప్రాణాలు తీసినట్లు అగ్నిమాపక శాఖ అధికారుల విచారణలో తేలిందని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. మోడీ పెరల్స్ షాపులోని డిస్ప్లే బోర్డులో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన 17 మంది దట్టమైన పొగతో ఊపిరి అడక మృతి చెందారని వివరించారు. నగరంలోని నానక్రముడలోని ఫైర్ డీజీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బుధవారం డీజీ నాగిరెడ్డి మాట్లాడారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గుల్జార్ హౌస్ ప్రమాదంలో ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో జరిగిందన్నారు. కింద ఫ్లోర్ మొత్తం ఉడ్ వర్క్ చేయడం వల్ల అవి అంటుకుంటున్న సమయంలో దట్టమైన పొగ వ్యాపించిందన్నారు.

Tags:    

Similar News