TG : ఈదురు గాలుల బీభత్సం.. రైతులకు నష్టం

Update: 2025-05-02 06:00 GMT

తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న రాత్రి భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టిం చాయి. పెద్దపల్లి జిల్లా మంథని, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచడంతో పంటలకు తీవ్రన ష్టం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహరరావు మండలంలో, తాడిచెర్లలో భారీ ఈదురుగాలులు వీచడంతో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు జిల్లాలో కొన్నిచో ట్ల చెట్లు విరిగి పోగా.... మరికొన్ని చోట్ల ఇంటి పైకప్పులు, రేకులు ఎగిరిపోయాయి. పలుచో ట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో చాలా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బలమైన ఈదురుగాలులుకు మంథనిలోని మూడంతస్తుల భవనంపైనున్న రేకుల షెడ్డు కూలిపోయింది. ఎక్లాస్ పూర్, ఖానాపూర్, గ్రామాలలో ఇంటి పైకప్పులు కూలి పోయాయి. నష్టపోయిన రైతులను ప్ర భుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News