Osmania Hopital: గవర్నర్ వర్సెస్ గవర్నర్‌మెంట్..
గవర్నర్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించడంపై రాజకీయ రచ్చ నెలకొంది.;
ఉస్మానియా ఆస్పత్రి అంశం గవర్నర్ వర్సెస్ గవర్నర్‌మెంట్‌గా మారింది. గవర్నర్ నేరుగా ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించడంపై రాజకీయ రచ్చ రేపింది. ఓ వైపు సచివాలయంలో ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధి, నూతన భవనాల నిర్మాణంపై స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించగా అదే సమయంలో గవర్నర్ తమిళిసై ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించడం వివాదానికి దారితీసింది. ఒక్కో బెడ్‌పై ఇద్దరు ముగ్గురు రోగులకు చికిత్స అందించే పరిస్థితి ఉందని టాయిలెట్లకు కనీసం డోర్లు కూడా సరిగాలేవని అన్నారు. ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి న్యాయపరమైన చిక్కులు ఉంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూడాలని సూచించారు.
ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన గవర్నర్‌కు అదే స్థాయిలో మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. గవర్నర్ తమిళిసై పేరెత్తకుండానే స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. కొందరు హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని అన్నారు. కొందరు కళ్లుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారు. అలాంటివేం పట్టించుకోబోం టీమ్ స్పిరిట్‌తో ముందుకెళ్తామన్నారు.