TG " మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ కేసు .. ముగ్గురు నిందితుల అరెస్ట్
జనవరి10న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే.. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. యూపీ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ పాండాతో పాటు మరో ఇద్దరి అరెస్ట్ చేయగా.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నా రు. జూబ్లీహిల్స్ రోడ్ నం.92లో ఉంటున్న పొన్నాల లక్ష్మయ్య జనవరి 10న తిరుపతి కి వెళ్లి వచ్చి చూసేసరికి ఇంటి బెడ్రూమ్ తలుపులు, కబోర్డు తెరిచి ఉన్నట్లు గుర్తించారు. అల్మారాలో రూ.10లక్షల బంగారు నగలు, రూ.1.5 లక్షల క్యాష్ కనిపించకపోవడంతో ఆయన ఫిల్మ్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 87లో వ్యాపారి సురేందర్ రెడ్డి ఇంట్లో దొంగతనం చేసిన యూపీకి చెందిన డ్రైవర్ రాజ్ కు మార్పాండా అనే వ్యక్తిని వేలిముద్రలు సేకరించి ఫింగర్ ప్రింట్ బ్యూరోలో నమోదు చేశారు. పొన్నాల లక్ష్యయ్య ఇంట్లో చోరీ సం దర్భంగా లభ్యమైన వేలిముద్రలతో పాండా ఫింగర్ ప్రింట్స్ సరిపోవడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.