TG: సింపతీ కోసమే పదే పదే అరెస్ట్ అంటున్నారు.. కేటీఆర్ పై శ్రీధర్ బాబు ఆగ్రహం
కేటీఆర్‌ను అరెస్టు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కుట్ర చేయడం లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ నేతలే అలా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. లగచర్ల ఘటన బీఆర్ఎస్ పార్టీ కుట్రేనని , మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులూ ఉన్నా రైతులకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని అన్నారు. ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి తమకు అప్పగించారని విమర్శించారు. అయినా తాము నిధులు సమకూర్చుకుంటున్నామని చెప్పారు. హరీష్ రావు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.