TG : కేటీఆర్ ఢిల్లీ వెళ్లింది ఇందుకే.. పొన్నం హాట్ కామెంట్

Update: 2024-11-12 09:30 GMT

తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిల్లీ టూర్‌కి వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా పోలీసుల విచారణకు కేటీఆర్‌ సహకరించాలన్నారు. కేంద్ర సహాయం కోసం కలిసి దిల్లీ వెళ్దామంటే.. ప్రతిపక్షాలు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు మాత్రం కేటీఆర్‌ ఢిల్లీకి పరుగెడుతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి అమృత్‌ పథకంపై ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ చెబుతున్నారని.. తన రక్షణ కోసం కేంద్రం వద్ద మోకరిల్లేందుకు కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లారన్నారు. అమృత్‌ పథకంలో అవినీతి జరిగితే కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చన్నారు పొన్నం. 

Tags:    

Similar News