Palla Rajeshwar Reddy : ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలి : ఎమ్మెల్యే పల్లా

Update: 2025-09-30 09:15 GMT

పది మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విషయం బహిరంగ రహస్యమని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టిన విచారణకు పల్లా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.... ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు అసంబద్ద ప్రశ్నలు వేసినా... ఓపికతో సమాధానం చెప్పామని తెలిపారు. పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలు.... నిస్సుగ్గుగా కాంగ్రెస్ లో చేరలేదని చెప్తున్నారని మండిపడ్డారు. ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని విచారణ సందర్భంగా స్పష్టంగా చెప్పామని వెల్లడించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను తమ న్యాయవాదులు వచ్చే నెల 1న క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News