Road Accident : ఖమ్మం-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం.. స్పాట్ లోనే ముగ్గురు..

Update: 2025-07-04 08:45 GMT

ఖమ్మం - వరంగల్‌ హైవే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరిపెడ శివారు కుడియాతండా వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రెండు లారీల డ్రైవర్లతో పాటు క్లీనర్‌ మరణించాడు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్‌తో మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News