Manikonda: సెల్లార్ గుంత తీస్తుండగా కూలిన గోడ.. ముగ్గురు కూలీలు మృతి..
Manikonda: మణికొండ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పుప్పాల గూడలో గోడ కూలి ముగ్గురు మృతిచెందారు.;
Manikonda: హైదరాబాద్‌లోని మణికొండ మున్సిపల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పుప్పాల గూడలో గోడ కూలి ముగ్గురు మృతిచెందారు. మూడు ప్లోర్‌ల సెల్లార్‌గుంత తీయడంతో గోడ కూలి ఈ ప్రమాదం జరిగింది. సెల్లార్ గుంతకు ఆనుకొని స్లాబ్ కోసం సెంట్రింగ్ కడుతున్న క్రమంలో ఒక్కసారిగా గోడ కుంగిపోయింది. దీంతో సెంట్రింగ్ డబ్బాలు వారిపై పడటంతో వారు మృత్యువాత పడ్డారు. సంఘటనా స్థలానికిచేరుకున్న పోలీసులు.. మృతులు బీహార్‌కు చెందినవారుగా గుర్తించారు. మృతదేహాలు మట్టిలో కూరుకుపోవడంతో జేసీబీ సహాయంతో మట్టిని తొలగించి .. డెడ్ బాడీలను వెలికితీశారు.