Khairatabad Ganapati : ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు నేడే ఆఖరి రోజు..

Update: 2025-09-04 08:00 GMT

ఖైరతాబాద్లో కొలువుదీరిన భారీ గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నగర ప్రజలే కాకుండా రాష్ట్రంలోనీ వివిధ ప్రాంతాల నుండి బొజ్జ గణపయ్య దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 లక్షల మంది గణనాథుని దర్శించుకున్నారని ఉత్సవ కమిటీ అంచనా వేస్తుంది. ఈ నెల 6వ తేదీన నిర్వహించే గణపయ్య నిమజ్జనం , శోభాయాత్రకు ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులను ఈరోజు రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నారు. కాగా నేడు ఆఖరి రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు. అర్థరాత్రి 12 గంటల తర్వాత మహా గణపతికి కలశ పూజ నిర్వహిస్తారు. 6 వ తేదీన జరిగే శోభాయాత్ర లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. నిమజ్జనం కోసం శంషాబాద్ నుండి భారీ క్రేన్ తీసుకువస్తున్నారు. కేంద్ర మంత్రి రానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News