నేడు తెలంగాణకు రానున్న జేపీ నడ్డా.. నాగర్ కర్నూల్‌లో బహిరంగ సభ
ఇవాళ నాగర్ కర్నూల్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు.;
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణకు రానున్నారు. నాగర్ కర్నూల్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈమేరకు జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్‌ను బీజేపీ నేతలు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు జేపీ నడ్దా. ఆ తర్వాత మధ్నాహ్నం ఒంటి గంట 15 నిమిషాలకు ప్రారంభమయ్యే అభియాన్ సే సంపర్క్ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఇద్దరు ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం జూబ్లీహిల్స్‌లో ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్, పద్మశ్రీ ఆనంద శంకర్ ఇంటికి వెళ్తారు.
ఇక జూబ్లీహిల్స్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటలకు జేపీ నడ్డా నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా నాగర్‌కర్నూల్ సభకు వెళ్తారు. సభ ముగిసిన అనంతరం తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటల 40 నిమిషాలకు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి నేరుగా తిరువనంతపురం వెళ్లనున్నారు.