Revanth Reddy : అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారు : రేవంత్ రెడ్డి
Revanth Reddy : నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయమే జరిగిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.;
Revanth Reddy (tv5news.in)
Revanth Reddy : నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయమే జరిగిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 2014లో లక్షా 50 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తానన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్... నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు.కాంగ్రెస్ యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో జరిగిన నిరుద్యోగ నిరసన దీక్షలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబంలోని వారికి, వారి పార్టీ వారికి ఉద్యోగాలు వచ్చాయి కానీ నిరుద్యోగులకు మొండిచెయ్యే లభించిందని దుయ్యబట్టారు. ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్న హరీష్ రావు... మరి బిశ్వాస్ కమిటీ చెప్పిన లెక్కలు తప్పా అని ప్రశ్నించారు.