తెలంగాణ PCC అధ్యక్ష పదవిపై కొనసాగనున్న సంప్రదింపులు

Update: 2020-12-14 14:22 GMT

తెలంగాణ PCC అధ్యక్ష పదవిపై సంప్రదింపులు కొనసాగనున్నాయి. పీసీసీ చీఫ్‌ అంశానికి సంబంధించి ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్ హైకమాండ్‌కి ఇంకా నివేదిక ఇవ్వలేదు. 18 కేటగిరిలలో 162 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్నామని.. పీసీసీ అధ్యక్ష పదవిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

జిల్లా స్థాయి నేతల వరకూ అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నామని.. క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తీసుకున్నాకే నూతన అధ్యక్షుడి నియామకం ఉంటుందని తెలిపారు. అటు.. ప్రజల్లో బలం లేని నేతలే కాంగ్రెస్‌ను వీడుతున్నారని.. కొందరు పార్టీని వీడినా నష్టం లేదని మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. సంస్థాగత లోపాల వల్లే గ్రేటర్‌లో సరైన ఫలితాలు రాలేదన్న ఠాగూర్.. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అన్నట్టు బీజేపీ-టీఆర్‌ఎస్‌ స్నేహం ఉందని ఆరోపించారు.


Tags:    

Similar News