రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
జాతిపిత మహాత్మగాంధీ వర్థంతి సందర్భంగా ఉ.10 గం -11.30 వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు.;
ఈనెల 30న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. జాతిపిత మహాత్మగాంధీ వర్థంతి సందర్భంగా ఉ.10 గం -11.30 వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. గవర్నర్ తమిళ సై, సీఎం కేసీఆర్ లంగర్‌హౌజ్‌లోని బాపుఘాట్‌లో నివాళులు అర్పించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బాపుఘాట్, లంగర్‌హౌజ్, నానల్ నగర్, ఆంధ్రా ఫ్లోర్ మిల్, సంగం బస్టాప్ పరిసరాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.