Tragedy in Habsiguda : హబ్సిగూడలో విషాదం.. చిట్ ఫండ్స్ లో ఇద్దరు మృతి

Update: 2025-01-18 11:15 GMT

హైదరాబాద్‌ హబ్సిగూడలోని సైంటిస్ట్‌ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. శుభ నందిని చిట్ ఫండ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు అంటున్నాయి. బోర్డు తీసే క్రమంలో షార్ట్‌ సర్య్యూట్‌ అయి మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రక్షించే ప్రయత్నం చేసినా అప్పటికే మంటల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులు జటోతు బాలు, మల్లేష్‌గా గుర్తించారు. మల్లేష్‌ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వాసిగా గుర్తించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Tags:    

Similar News