Road Accidents : నెత్తురోడిన హైదరాబాద్ ఓర్ఆర్ఆర్.. లారీని ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే

Update: 2025-07-18 08:15 GMT

హైదరాబాద్ ఓర్ఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదాలు కలవపెడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాలు జరగ్గా.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇవాళ మరో ప్రమాదం జరిగింది. ఆదిభట్ల ORR వద్ద తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరోక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మాలోత్ చందు లాల్, గుగులోత్ జనార్దన్, కావలిబాలరాజు గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ వద్ద జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. అతివేగం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News