ఎమ్మెల్సీ రెండో రౌండ్ కౌంటింగ్ ఫలితాలు.. టీఆర్‌ఎస్ అభ్యర్థికే ఆధిక్యం
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రెండో రౌండ్ పూర్తైంది. ఈ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థికే ఆధిక్యం వచ్చింది.;
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రెండో రౌండ్ పూర్తైంది. ఈ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థికే ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 17వేల 732 ఓట్లు, బీజేపీకి 16వేల 173 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 8వేల 594 ఓట్లు, కాంగ్రెస్‌కు 4వేల 980 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లు కలిపి టీఆర్‌ఎస్‌కు 2వేల 613 ఓట్ల ఆధిక్యం లభించింది. రెండు రౌండ్లు కలిపితే టీఆర్‌ఎస్ అభ్యర్ధి వాణీదేవికి 35వేల 171 ఓట్లు, రామచంద్రరావుకు 32వేల 558 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 16వేల 957 ఓట్లు, చిన్నారెడ్డికి 10వేల 62 ఓట్లు వచ్చాయి.