ఈనెల 7న టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం
ఈనెల 7వ తేదీ సాయంత్రం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది..;
ఈనెల 7వ తేదీ సాయంత్రం టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో ఈ భేటీ జరగనుంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి మృతికి టీఆర్ఎస్ఎల్పీ సంతాపం తెలపనుంది. అనంతరం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నారు సీఎం.