నకిరేకల్ మున్సిపాల్టీలో టీఆర్‌ఎస్ వర్సెస్ టీఆర్‌ఎస్
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికలు టీఆర్‌ఎస్ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్టుగా సాగాయి. సొంత పార్టీలోనే రెండు గ్రూపులు తయారయ్యాయి.;
నకిరేకల్ మున్సిపల్ ఎన్నికలు టీఆర్‌ఎస్ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్టుగా సాగాయి. సొంత పార్టీలోనే రెండు గ్రూపులు తయారయ్యాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మధ్య మున్సిపల్ వార్ నడుస్తోంది. నకిరేకల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధులు బరిలో దిగారు. అయితే, మాజీ ఎమ్మెల్యే వీరేశం మాత్రం.. ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు మీద తన అనుచరులైన 14 మందిని బరిలో దింపారు. ఇప్పటి వరకు 12 వార్డుల్లో ఫలితాలు రాగా.. వీటిలో టీఆర్‌ఎస్ ఏడు వార్డులు, ఫార్వర్డ్ బ్లాక్ మూడు వార్డులు గెలిచాయి.