TS : ధరణి ముసుగులో బినామీలకు దోచి పెడుతున్నారు : కిషన్ రెడ్డి

Update: 2023-05-12 13:45 GMT

ధరణి ముసుగులో బినామీలకు, రియల్ ఎస్టేట్‌ కంపెనీలకు భూములను దోచి పెడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు దళారులుగా మారి భూయజమానులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ కారణంగా లక్షలాది మంది రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే ధరణికి ప్రత్యామ్నయం తీసుకొస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ మజ్లిస్ చేతిలో ఉందనడానికి జగిత్యాల ఘటనే ఉదాహారణ అన్నారు. ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టలేనప్పుడు.. వందల కోట్లతో కొట్టిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్ ఎందుకని ప్రశ్నించారు.

Similar News