తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా యూకేలో మంత్రి కేటీఆర్ పర్యటన కొన సా గుతోంది. ఈ సందర్భంగా LSEG సీఐఓతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. భేటీ అనంతరం హైదరాబాద్‌లో టెక్నాల జీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నెల కొల్పనున్నట్లు ప్రకటించారు. అనంతరం ఒప్పంద పత్రాలపై మంత్రి కేటీఆర్‌తో పాటు LSEG సీఐఓ ఆంథోని మెక్‌కార్త్ సంతకాలు చేశారు. దీంతో యేడాదికి సుమారు వేయి మందికి ఉపాధి లభించనుంది. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. 190 దేశాలలో వినియోగదారులకు సేవలు అందిస్తోంది.