Bandi sanjay : KCR డిప్రెషన్‌లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు: సంజయ్
Bandi sanjay : తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన కంటే దారుణమైన పాలన కొనసాగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.;
Bandi sanjay : తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన కంటే దారుణమైన పాలన కొనసాగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. TRS నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
యువ తెలంగాణ పార్టీ...బీజేపీలో విలీనం సందర్భంగా ఢిల్లీలో సంజయ్ మాట్లాడారు. KCR డిప్రెషన్‌లో ఉండి ఏది పడితే అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశ రాజకీయాల్లో చర్చ జరిగేందుకే సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేసీఆర్ మాట్లాడారని ఆరోపించారు. కొడుకును సీఎం చేసి జాతీయ రాజకీయాల్లోకి వచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు సంజయ్.
సంజయ్ నేతృత్వంలో బీజేపీ దూకుడు చూసి కేసీఆర్ అసహనం మొదలైందన్నారు జిట్టా బాలకృష్ణ రెడ్డి. TRS ముక్త్ తెలంగాణ కోసమే బీజేపీలో యువ తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నట్లు చెప్పారు. మరోసారి ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.