గృహలక్ష్మి పేరిట తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన పథకం ఆగస్టు చివరి వారం నుంచి అమలుకానుంది. దీని కోసం లబ్ధిదారుల నుంచి వచ్చే నెల చివరి వారం నుంచి దరఖాస్తులను ఆహ్వానించనుంది. మంత్రి స్ధాయిలో మథనం చేసి.. ముసాయిదా విధానాలను సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారులు అందజేస్తారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేశాక తుది ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 వేల మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం అందచేయనున్నందున.. మిగిలిన దరఖాస్తుదారులను ప్రాధాన్యక్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు చేసుకునేందుకు తుది గడువును కూడా సీఎంతో భేటీ అయ్యాక ప్రకటించే అవకాశం ఉంది.