TG: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం మధ్యాహ్నం ఫలితాలు రిలీజ్ చేశారు. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇంటర్ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. మొదటి ఏడాది 66.89%, రెండో ఏడాది 71.3% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.
మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపటి క్రితమే విడుదల అయ్యాయి. మే 22వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. రేపటి(బుధవారం) నుంచి ఈ నెలాఖరు వరకు విద్యార్థులు ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు.