Group-2 Exams : తెలంగాణలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు

Update: 2024-12-15 08:00 GMT

తెలంగాణలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. OMR పద్ధతిలో 1,368 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 783 గ్రూప్-2 సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 5,51,943 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 10-12.30, మధ్యాహ్నం 3- 5.30గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

అభ్యర్థులకు TGPSC కీలక సూచనలు:

గ్రూప్ 2 అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్ ఉన్నవారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.

ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీని(Passport, Pan Card, Voter ID, Aadhaar Card, Government Employee ID లేదా డ్రైవింగ్ లైసెన్స్ ) చూపించాల్సి ఉంటుంది.

హాల్ టికెట్ పై క్లియర్ గా కనిపించేలా ఫొటో ఉండాలి. ఇలా లేకపోతే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి.

పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందుగానే చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడొచ్చు.

ఉదయం 08. 30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 09.30 గంటలకు గేట్లు మూసివేస్తారు.

ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి తీసుకెళ్లరాదు.

మాల్ ప్రాక్టీసింగ్, చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. టీజీపీఎస్సీ పరీక్షలు రాయకుండా చర్యలు తీసుకుంటారు.

Tags:    

Similar News