Nirmal: కలకలం రేపిన ఫారెస్ట్ అధికారుల ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా..?
Nirmal: నిర్మల్ జిల్లాలో ఫారెస్ట్ సిబ్బంది ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.;
Nirmal: నిర్మల్ జిల్లాలో ఫారెస్ట్ సిబ్బంది ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. మామడ రేంజ్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న DRO రాజశేఖర్, FBO వెన్నెలను సస్పెండ్ చేస్తూ.. సీసీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరణ ఇచ్చేందుకు ఇవాళ నిర్మల్ జిల్లా అటవీశాఖ కార్యాలయంలోవెళ్లిన సిబ్బంది.. అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఇద్దరిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు..