Warangal: పెళ్లింట విషాదం.. సోదరుడి రిసెప్షన్‌కి కూరగాయలు తేవడానికి వెళ్లి యాక్సిడెంట్..
Warangal: వరంగల్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెళ్లింట్లో విషాదం నింపింది.;
Warangal: వరంగల్ జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెళ్లింట్లో విషాదం నింపింది. వర్థన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన సుధాకర్‌తోపాటు మరో వ్యక్తి బైక్‌పై వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరూ స్పాట్‌లోనే మృతి చెందారు. సోదరుడి వివాహం అనంతరం రిసెప్షన్ విందు కోసం కూరగాయలు తెచ్చేందుకు వరంగల్ మార్కెట్‌కు వచ్చిన వీరిద్దరూ తిరిగి వెళ్తూ యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో పెళ్లింట్లో విషాద ఛాయలు అలముకున్నాయి.