Kishan Reddy : సంక్షేమ పథకాల డబ్బులన్నీ టీఆర్‌ఎస్ నేతల జేబుల్లోకే వెళ్తున్నాయి: కిషన్ రెడ్డి
Kishan Reddy : కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేందుకే... తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి;
Kishan Reddy : కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చేందుకే... తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఒక్కరేనన్నట్లు కేటీఆర్ మాట్లాడడాన్ని తప్పుపట్టారు.
సబ్బండ వర్ణాలు, విద్యార్థుల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ వచ్చిందని.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షల మేరకు పార్లమెంట్‌లో బీజేపీ పోషించిన పాత్ర కూడా కారణమన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడంలేదంటున్న కేటీఆర్.. రాష్ట్రానికి వచ్చే నిధులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
సంక్షేమ పథకాల డబ్బులన్నీ టీఆర్‌ఎస్ నేతల జేబుల్లోకే వెళుతున్నాయని ఆరోపించారు. అన్ని రంగాల్లో విఫలమైన టీఆర్‌ఎసకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేల్లో తేలడంతో కేసీఆర్ అభద్రతాభావంతో ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పారు.