BJP: కాంగ్రెస్‌ది అన్యాయ్ పత్ర్
మోదీ గ్యారంటీలు అమలు చేస్తాం.... సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించిన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్;
మోదీగ్యారంటీ ఇచ్చారంటే.. కచ్చితంగా అమలు చేసేస్తారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రజల మేనిఫెస్టోనే బీజేపీ మేనిఫేస్టోఅని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ న్యాయ పత్రాన్ని ప్రజలు అన్యాయ పత్రంగా భావిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో సంకల్ప పత్రాన్ని సీనియర్ నేత లక్ష్మణ్ తో కలిసి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. 2047 వికసిత భారత్ లక్ష్యంగా భాజపా ముందుకెళ్తోందని..... కిషన్‌రెడ్డి పునరుద్ఘాటించారు.నాణ్యమైనవిద్య, అందరికీ ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు అందిస్తామని ప్రధానిమోదీ గ్యారంటీ ఇస్తున్నారన్నారని తెలిపారు.
నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మన మోదీ గ్యారంటీ 2024 - సంకల్ప పత్రాన్ని ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇస్తున్న ఉచితబియ్యం కార్యక్రమం మరో ఐదేళ్లు కొనసాగుతుందన్నారు. పేపర్ లీకేజీ అరికట్టేలా కఠినచట్టాలు తీసుకొచ్చామని తెలిపారు. మోదీ హయాంలో భారత్ ప్రపంచంలో ఐదోఆర్థికవ్యవస్థగా ఆవిర్భవించిందని, వచ్చే ఐదేళ్లలో మూడోఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందనిమోదీ గ్యా రంటీ ఇస్తున్నారని కిషన్‌రెడ్డి వివరించారు. భారత్‌ను సర్వీస్ సెక్టార్ హబ్‌గా విస్తరిస్తామని పోస్టాఫీసులను మినీ బ్యాంక్‌లుగా మార్చేస్తున్నట్లు చెప్పారు. భారతదేశాన్ని మిల్లెట్ హబ్‌గా మార్చడం సహా మత్స్యకారులను అన్ని విధాల ఆదుకుంటామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ న్యాయ పత్రాన్ని ప్రజలు అన్యాయ పత్రంగా భావిస్తున్నారని.... భాజపా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ న్యాయ పత్రానికి భిన్నంగా భాజపా సంకల్ప పత్రం ఉందని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా కాంగ్రెస్ పార్టీ...ఇంకా అవినీతి, బంధుప్రీతిని వీడలేదని భాజపా నేతలు విమర్శించారు.
దశాబ్దాల తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. 2047 నాటికి వికసిత భారత్ పేరుతో భాజపా ముందుకెళ్తోందని, ఐదేళ్లలో దేశాన్ని మూడో ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ మోదీ పాలనలో నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు అందుబాటులోకి వచ్చాయి. పేపర్ లీకేజీ అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చాం. పోస్టాఫీసులను మినీ బ్యాంకులుగా మార్చేస్తున్నాం. దేశాన్ని మిల్లెట్ హబ్‌గా మారుస్తాం. దేశ భవిష్యత్ కోసమే వన్ నేషన్.. వన్ ఎలక్షన్’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.