ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూసూర్ బ్రిడ్జి సమీపాన ఉన్న రిసార్ట్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మ హత్యకు పాల్పడిన హరీషకు తల్లిదండ్రులు, అన్నయ్య, చెల్లి ఉన్నారు. ఆయన సొంత గ్రామం భూపా లపల్లి జిల్లా రేగుండ మండలం వెంకటేశ్వరపల్లి. గ్రామం. ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమా చారం అందిన వెంటనే వెంకటాపురం సీఐ బండారి కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయం ములుగు ఎస్పీ శబరీష్ కు సీఐ సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకుని ఎస్పీ మృత దేహాన్ని పరిశీలించారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత కారణాలు వెల్లడి స్తామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగి స్తామని చెప్పారు. రైతు కుటుంబానికి చెందిన రుద్రా రఫు హరీష్ అన్నయ్య ఢిల్లీ బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. 2022వ సంవత్సరం ఎస్ఐ బ్యాచికి చెందిన హరీష్ వాజేడు పోలీసు స్టేషన్లో ట్రైనీ ఎస్ఐగా పనిచేశారు. 29-10-2022న పేరూరు ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించారు. ఏడాది తర్వాత ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వీఆర్కు బదిలీ చేశారు. అనంతరం 17-06-2024న వాజేడు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అక్కడే ఎస్ఐగా పనిచేస్తున్నారు.
ప్రేమ-పెళ్లి మధ్య నలిగిపోయి వాజేడు ఎస్ఐ ఆర్.హరీష్ ఆత్మ హత్య చేసుకున్నారని పలువురు అనుమానిస్తున్నారు