Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్యకు యాక్సిడెంట్.. ఆస్పత్రికి తరలింపు..
Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాలు అయ్యాయి.;
Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రగాయాలు అయ్యాయి. ఖమ్మం గ్రామీణ మండలం రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్య.. తెల్లవారుజామున మారమ్మగుడి వద్ద మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రామయ్యను వాహనం ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వనజీవి రామయ్యను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో రామయ్యకు చికిత్స అందిస్తున్నారు.