వాసాలమర్రిలో పండుగ వాతావరణం.. కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం..!

యాదాద్రి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితులు సంబరాలు చేసుకుంటున్నారు.;

Update: 2021-08-05 12:30 GMT

యాదాద్రి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితులు సంబరాలు చేసుకుంటున్నారు. గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు... దళిత బంధు నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ కావడంతో.. డప్పులు కొడుతూ.. స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి బతుకమ్మ ఆట ఆడారు. కేసీఆర్‌ తమను లక్షాధికారులను చేశారంటూ దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి... 24 గంటల్లో దళితుల అకౌంట్లలో 10 లక్షల చొప్పున డబ్బులు పడతాయంటూ హామీ ఇచ్చారు. అన్నట్లుగానే ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా 7 కోట్ల 60 లక్షల రూపాయలు విడుదల చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News